26/07/2025
మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ లోని తీగల కృష్ణారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో 5th గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సిఎస్(IAS) ఎల్వి సుబ్రహ్మణ్యం గారు హాజరైనారు
ఎల్వి సుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతూ గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా పట్టభద్రులైన విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు అభినందనలు తెలుపుతూ తెలిపారు బాధ్యతాయుతమైన పౌరులుగా ఉండాలని విద్యార్థులు విజయవంతం గా గ్రాడ్యుయేట్లుగా తీర్చిదిద్దటం ఇన్ని వేల మందికి విద్యను అందిస్తున్న కృష్ణా రెడ్డి గారికి కళాశాల యాజమాన్యం కు అభినందనలు తెలిపారు
ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవగానే ఉన్నతమైన శిఖరాలను అధిరోహించే విధంగా మీరు భవిష్యత్ కార్యాచరణ ఏర్పాటు చేసుకొని రాబోయే కాలానికి మారుతున్న టెక్నాలజీకి అనుకూలంగా కోర్సులను ఎంపిక చేసుకుని ముందుకు సాగాలని కోరారు
నేర్చుకున్న విద్యతో పాటు సంస్కారం గురువులను గౌరవించడం తల్లిదండ్రులను గౌరవించడం చదువే కాకుండా సమాజానికి కూడా ఉపయోగపడేలా ఏదైనా ఒక మంచి పని నేర్చుకొని ముందుకు సాగాలని కోరారు
ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ తీగల కృష్ణారెడ్డి గారు సెక్రటరీ హరినాథ్ రెడ్డి గారు ట్రెజరర్ అమర్నాథ్ రెడ్డి గారు మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనిత రెడ్డి గారు ప్రిన్సిపల్స్ రవిశంకర్ గారు మురళీమోహన్ గారు మరియు హెచ్వోడీలు అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు